Nellore: మర్రిపాడులో వడదెబ్బకు ఇద్దరు రైతుల బలి
Nellore: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం సన్నువారిపల్లిలో ఎండతీవ్రత ఇద్దరు రైతుల ప్రాణాలను బలితీసుకుంది.
Nellore: మర్రిపాడులో వడదెబ్బకు ఇద్దరు రైతుల బలి
Nellore: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం సన్నువారిపల్లి గ్రామంలో ఎండతీవ్రతకు వడదెబ్బ తగిలి ఇద్దరు రైతులు ప్రాణాలు కోల్పోయారు. మర్రిపాడు మండలంలో నమోదైన అధిక ఉష్ణోగ్రతల కారణంగా గంగిరెడ్డి చెన్నారెడ్డి (55), చాగం రామస్వామి(66) వడదెబ్బకు గురై సాయంత్రం మృతి చెందారు. చెన్నారెడ్డి పొలం పనులు ముగించుకుని మధ్యాహ్నానికి ఇంటికి వచ్చిన కొద్దిసేపటికె అస్వస్థతకు గురికాగా కుటుంబ సభ్యులు గమనించి వెంటనే 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
అలాగే రామస్వామి ఇంటి వద్దే ఉండగా అస్వస్థతకు గురయ్యారు. 108 కు సమాచారం అందించారు. 18 వాహనంలో వచ్చిన సిబ్బంది పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు.ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. మృతి చెందిన పేద రైతు కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని గ్రామస్థులు,బంధువులు విజ్ఞప్తి చేస్తున్నారు.




