Nellore: అతివేగం.. నిండు ప్రాణాలను బలిగొన్న లారీ నెల్లూరులో ఘోర ప్రమాదం

Nellore: నెల్లూరు ముత్తుకూరు రోడ్డు వడ్డిపాలెం వద్ద ఘోర ప్రమాదం. అతివేగంతో వచ్చిన లారీ స్కూటీని ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి.

V. Narasimhulu, Nellore
Published on: 20 April 2026 1:52 PM IST
Nellore
X

Nellore: అతివేగం.. నిండు ప్రాణాలను బలిగొన్న లారీ నెల్లూరులో ఘోర ప్రమాదం

Nellore: నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.. ముత్తుకూరు రోడ్డు, వడ్డిపాలెం సమీపంలో స్కూటీని వేగంగా వస్తున్న లారీ ఢీ కొట్టడంతో స్కూటీ లో ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.. ఒక్కసారిగా ముత్తుకూరు రోడ్డు రక్తసిక్తం కావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక నిర్ధారణలో తేలింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతుల వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story