Rapur: రాపూరు మండలంలో గిరిజన దంపతులను ఢీకొట్టిన స్కూటర్!

Rapur: నెల్లూరు జిల్లా రాపూరు మండలం తూమాయి నుంచి నెల్లేపల్లికి వెళ్తున్న గిరిజన దంపతులను ఢీకొట్టిన స్కూటర్. భర్తకు తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు.

Yellayya, Nellore
Published on: 23 Sept 2026 10:50 AM IST
Rapur
X

Rapur: రాపూరు మండలంలో గిరిజన దంపతులను ఢీకొట్టిన స్కూటర్!

Rapur: తూమాయి నుంచి నెల్లేపల్లికి కాలినడకన వెళ్తున్న గిరిజన దంపతులను అతివేగంగా వచ్చిన స్కూటర్ ఢీకొట్టడంతో ఇద్దరికీ గాయలయున సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నెల్లేపల్లికి చెందిన తాటిబోయిన పొలమ్మకు స్వల్ప గాయాలవ్వగా, ఆమె భర్త వెంకటయ్య రెండు కాళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు బాధితులను మొదట పొదలకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెంకటయ్య రెండు కాళ్లకు తీవ్ర గాయాలు కాగా మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి నెల్లూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Yellayya, Nellore

Yellayya, Nellore