Udayagiri: ఉదయగిరి బీసీ కాలనీలో కార్డెన్ సెర్చ్: 38 వాహనాలు సీజ్!
Udayagiri: ఉదయగిరి బీసీ కాలనీలో సీఐ వెంకట్రావు ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్. పత్రాలు లేని 32 బైకులు, 5 ఆటోలు, ఒక బస్సును స్వాధీనం చేసుకున్న పోలీసులు.
Udayagiri: ఉదయగిరి బీసీ కాలనీలో కార్డెన్ సెర్చ్: 38 వాహనాలు సీజ్!
Udayagiri: నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలోని ఉన్న బీసీ కాలనీలో పోలీసులు విస్తృతంగా కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సీఐ వెంకట్రావు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ తనిఖీల్లో అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, నివాసాలను పరిశీలించారు.ఈ సందర్భంగా వాహనాల పత్రాలను తనిఖీ చేయగా, సరైన పత్రాలు లేని 32 మోటార్ బైకులు, 5 ఆటోలు, ఒక బస్సును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.సంబంధిత వాహనాల యజమానులకు చట్టపరమైన నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
అనంతరం సీఐ వెంకట్రావు మాట్లాడుతూ.. పట్టణంలో అపరిచిత వ్యక్తుల సంచారం కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. ప్రజల సహకారంతోనే నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని, ఇలాంటి కార్డెన్ సెర్చ్‌లు తరచూ నిర్వహిస్తామని సీఐ వెంకట్రావు తెలిపారు.




