Nellore: ఉదయగిరి నియోజకవర్గానికి కొత్త బీఎస్‌ఎన్‌ఎల్ టవర్లు మంజూరు!
Nellore: గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్, ఇంటర్నెట్ నెట్‌వర్క్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం 34 కొత్త BSNL మొబైల్ టవర్లను మంజూరు చేసింది.
Nellore: ఉదయగిరి నియోజకవర్గానికి కొత్త బీఎస్‌ఎన్‌ఎల్ టవర్లు మంజూరు!
Nellore: గ్రామీణ ప్రాంతాల్లో టెలికాం సేవలను మరింత బలోపేతం చేసే దిశగా ఉదయగిరి నియోజకవర్గానికి 34 కొత్త బీఎస్ఎన్ఎల్ మొబైల్ టవర్లు మంజూరయ్యాయి. నెల్లూరులోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో నిర్వహించిన 3వ టెలికాం అడ్వైజరీ కమిటీ (TAC) సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.ఈ సమావేశంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, TAC సభ్యులు, బీఎస్ఎన్ఎల్ అధికారులు పాల్గొని టెలికాం సేవల విస్తరణ, గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్క్ సమస్యల పరిష్కారం, డిజిటల్ కనెక్టివిటీ మెరుగుదలపై చర్చించారు.
సమావేశానికి హాజరైన TAC సభ్యురాలు తాటికొండ అనూష మాట్లాడుతూ, ఉదయగిరి నియోజకవర్గానికి 34 మొబైల్ టవర్లు మంజూరు కావడం ప్రజలకు ఎంతో ప్రయోజనకరమని పేర్కొన్నారు. ఈ టవర్ల ఏర్పాటు ద్వారా ఇప్పటివరకు నెట్‌వర్క్ సమస్యలు ఎదుర్కొంటున్న గ్రామాలకు మెరుగైన మొబైల్, ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు.
అలాగే నియోజకవర్గ అభివృద్ధి, టెలికాం మౌలిక సదుపాయాల విస్తరణ కోసం కృషి చేసిన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌కు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 34 కొత్త టవర్ల ఏర్పాటు పూర్తయితే గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ కనెక్టివిటీ మరింత బలోపేతం కావడంతో పాటు విద్య, వైద్యం, వ్యవసాయం,
ఆన్‌లైన్ సేవల వినియోగానికి కూడా గణనీయమైన ఊతం లభించనుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి గ్రామానికి మెరుగైన నెట్‌వర్క్ సేవలు అందించాలనే లక్ష్యంతో తీసుకున్న ఈ నిర్ణయం ఉదయగిరి నియోజకవర్గ డిజిటల్ అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలవనుంది అని TAC సభ్యురాలు తాటికొండ అనూష పేర్కొన్నారు.




