Udayagiri: వర్షాభావ పరిస్థితులపై ఉదయగిరి రైతులకు అవగాహన!
Udayagiri: ఉదయగిరి నియోజకవర్గంలో ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ వర్సిటీ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన. ఎల్‌నినో, వర్షాభావంపై శాస్త్రవేత్తల కీలక సూచనలు.
Udayagiri: వర్షాభావ పరిస్థితులపై ఉదయగిరి రైతులకు అవగాహన!
ఉదయగిరి: నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులకు అవగాహన కల్పించే ప్రత్యేక కార్యక్రమాన్ని ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిర్వహించింది.
ఇందులో భాగంగా దుత్తలూరు, నర్రవాడ, వరికుంటపాడు, తిమ్మారెడ్డిపల్లి, పెద్దిరెడ్డిపల్లి, అప్పసముద్రం గ్రామాల్లో శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు, కళాశాల ఆచార్యులు, విద్యార్థులు క్షేత్రస్థాయిలో రైతులను కలిసి వర్షాభావ పరిస్థితులను తట్టుకునే వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు.
నీటి పొదుపు, తేమ సంరక్షణ, స్వల్పకాలిక పంటల సాగు, సూక్ష్మపోషకాల వినియోగం, విత్తన శుద్ధి, పంటల నిర్వహణ వంటి అంశాలపై రైతులకు సూచనలు అందించారు. రైతులు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా శాస్త్రీయ పద్ధతులను అనుసరించి దిగుబడులను కాపాడుకోవాలని శాస్త్రవేత్తలు సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు, వ్యవసాయ కళాశాల ఆచార్యులు, విద్యార్థులు, సుమారు 150 మంది రైతులు పాల్గొన్నారు.




