Udayagiri: చంద్రబాబు అరెస్ట్‌కు మూడేళ్లు - కొవ్వొత్తుల ర్యాలీ

Udayagiri: ఉదయగిరిలో చంద్రబాబు 53 రోజుల జైలు నిర్బంధానికి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ.

VENKATA PRASAD, UDAYAGIRI
Published on: 9 Sept 2026 9:12 PM IST
Udayagiri
X

Udayagiri: చంద్రబాబు అరెస్ట్‌కు మూడేళ్లు - కొవ్వొత్తుల ర్యాలీ

ఉదయగిరి: నెల్లూరు జిల్లా ఉదయగిరి బస్టాండ్ సర్కిల్‌లో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టై మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

ఉదయగిరి మాజీ శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని చంద్రబాబుకు మద్దతుగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం పోరాడిన చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్టు చేసి 53 రోజుల పాటు జైలులో నిర్బంధించినా ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గలేదన్నారు.

కష్టకాలాన్ని ధైర్యంగా ఎదుర్కొని ప్రజల అండతో తిరిగి రాష్ట్ర రాజకీయాల్లో అఖండ విజయాన్ని సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఆయన పోరాట పటిమకు నిదర్శనమన్నారు. చంద్రబాబు దూరదృష్టి, విజనరీ నాయకత్వం, రాష్ట్ర అభివృద్ధి పట్ల ఆయనకున్న అంకితభావం ప్రజలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.

VENKATA PRASAD, UDAYAGIRI

VENKATA PRASAD, UDAYAGIRI

Next Story