Udayagiri: ఉదయగిరిలో స్థానిక ఎన్నికల తీరుపై వైఎస్ఆర్‌సీపీ ఇన్‌చార్జి తీవ్ర అసంతృప్తి!
Udayagiri: నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ తీరుపై వైఎస్ఆర్‌సీపీ ఇన్‌చార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తి.
Udayagiri: ఉదయగిరిలో స్థానిక ఎన్నికల తీరుపై వైఎస్ఆర్‌సీపీ ఇన్‌చార్జి తీవ్ర అసంతృప్తి!
Udayagiri: నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ తీరుపై వైఎస్ఆర్‌సీపీ ఉదయగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు తమ పార్టీ అభ్యర్థులను అడుగడుగునా ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు.
ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీతారామపురం మండలంలో తమ అభ్యర్థుల నామినేషన్లను తొలుత తిరస్కరించారని, అధికారుల తీరుపై తాను ప్రశ్నించినప్పటికీ సరైన స్పందన రాలేదని పేర్కొన్నారు. జడ్పీటీసీ అభ్యర్థిని సైతం తమ పార్టీ నుంచి తప్పుకునేలా చేశారని ఆరోపించారు.
ఉదయగిరి మండలంలోనూ నామినేషన్ల తిరస్కరణతో పాటు ఎన్నికల సమయంలో తమ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేశారని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు సృష్టించి, తమ వారిని పోలీసుల ద్వారా అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు.బిజ్జపల్లి,తిరుమలపురం ప్రాంతాల్లోనూ ఎన్నికల విధుల నిర్వహణపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
ఇక ఓట్ల లెక్కింపు సమయంలోనూ తమ పార్టీ అభ్యర్థుల ఆధిక్యాన్ని తగ్గించే ప్రయత్నాలు జరిగాయని మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. తొలుత 37 ఓట్ల మెజారిటీతో ఉన్న ఫలితాన్ని రీకౌంటింగ్ పేరుతో 18 ఓట్లకు, అనంతరం 17 ఓట్లకు, చివరకు 2 ఓట్లు తో టిడిపి గెలిపించాలని పేర్కొన్నారు. కౌంటింగ్ సమయంలో గంటల తరబడి విరామాలు ఇవ్వడంతో పాటు మీడియాను లోపలికి అనుమతించకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
నామినేషన్ల నుంచి పోలింగ్, కౌంటింగ్ వరకు ప్రతి దశలోనూ తమ పార్టీకి ఇబ్బందులు కలిగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికల ప్రక్రియలో ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం దురదృష్టకరమన్నారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ చేయడం సరైన పద్ధతి కాదనే అభిప్రాయానికి వచ్చామని, జరిగిన పరిణామాలను ప్రజలకు వివరించేందుకే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినట్లు మేకపాటి రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు.




