Udayagiri: ఉదయగిరిలో ఘనంగా 'పల్లె పండుగ 3.0' ప్రారంభం ఎమ్మెల్యే కాకర్ల సురేష్

Udayagiri: ఉదయగిరి నియోజకవర్గం రామాపురంలో పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని నిర్వహించడం గర్వకారణమని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తెలిపారు.

VENKATA PRASAD, UDAYAGIRI
Published on: 29 Sept 2026 11:23 PM IST
Udayagiri
X

Udayagiri: ఉదయగిరిలో ఘనంగా 'పల్లె పండుగ 3.0' ప్రారంభం ఎమ్మెల్యే కాకర్ల సురేష్

ఉదయగిరి: ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం రామాపురం వేదికగా పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా రాష్ట్రవ్యాప్తంగా రూ.11,085 కోట్లతో చేపట్టే గ్రామీణ అభివృద్ధి పనులకు ఉదయగిరి వేదికగా శ్రీకారం చుట్టడం నియోజకవర్గ ప్రజలకు గర్వకారణమన్నారు.

పల్లెల అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధికి పునాది అనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే తెలిపారు. రహదారులు, తాగునీరు, సాగునీరు, గ్రామీణ మౌలిక వసతులు, వ్యవసాయం, పశుసంవర్ధక రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ గ్రామాల రూపురేఖలు మార్చేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు.

ఉదయగిరి నియోజకవర్గానికి పల్లె పండుగ ద్వారా ఇప్పటికే రూ.121 కోట్లతో 115 కిలోమీటర్ల మేర సీసీ, బీటీ రోడ్లు, 1,200కు పైగా నీటి కుంటలు, 348 మినీ గోకులాలు, 190కి పైగా నీటి తొట్లు, సుమారు 900 ఎకరాల్లో ఉద్యాన పంటల అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు.నియోజకవర్గంలోని ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సుజల శ్రవంతి పథకం ద్వారా రూ.52 కోట్లతో 381 పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.

దుత్తలూరు, జలదంకి, కలిగిరి, కొండాపురం, సీతారామపురం, ఉదయగిరి, వరికుంటపాడు, వింజమూరు మండలాలకు ఈ పనులు ప్రయోజనం చేకూర్చనున్నాయని చెప్పారు.ఉదయగిరి కోట, ఉదయగిరి కొండను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించడం కూడా నియోజకవర్గానికి ఎంతో ప్రాధాన్యత కలిగిన అంశమని ఎమ్మెల్యే అన్నారు.

కోటకు వెళ్లే మార్గంలో రహదారి అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం ద్వారా పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రామాపురం వేదికగా పల్లె పండుగ 3.0కు శ్రీకారం చుట్టడం ద్వారా ఉదయగిరి నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు లభించిందని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రారంభమైన అభివృద్ధి పనులతో ఉదయగిరి నియోజకవర్గంలోని గ్రామాలకు మరిన్ని మౌలిక వసతులు అందుబాటులోకి వస్తాయని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ప్రభుత్వం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు.

VENKATA PRASAD, UDAYAGIRI

VENKATA PRASAD, UDAYAGIRI