Nellore: హత్యకు గురైన జడ రసూల్ మృతదేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

Nellore: నెల్లూరు జిల్లా కొండాపురం మండలం గానుగపెంటలో జడ రసూల్ మృతి పట్ల ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నివాళులర్పించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 17 May 2026 5:32 PM IST
Nellore
X

Nellore: హత్యకు గురైన జడ రసూల్ మృతదేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

నెల్లూరు జిల్లా: కొండాపురం మండలం గానుగపెంట గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన జడ రసూల్ విషాదకర ఘటనలో మృతి చెందగా ఈ దుర్ఘటన విషయం తెలుసుకున్న గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ మృతుడి స్వగృహానికి చేరుకొని జడ రసూల్ మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే ఈ ఘటన పట్ల తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ వారికి ధైర్యం చెప్పారు. కుటుంబం ఎదుర్కొంటున్న బాధను అర్థం చేసుకుంటున్నామని, ఈ క్లిష్ట సమయంలో తాము అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయంగా కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ.50 వేల రూపాయలను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ, జడ రసూల్ మృతి వెనుక ఉన్న అసలు నిజాలు వెలుగులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఘటనకు బాధ్యులైన నిందితులకు కఠిన శిక్ష పడేలా అధికారులతో మాట్లాడి న్యాయం జరిగే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మృతుని కుటుంబానికి పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు తాము వారి వెంట ఉంటామని స్పష్టం చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story