Udayagiri: ఉదయగిరిలో ముగిసిన ఎంపీటీసీ నామినేషన్ల పర్వం ఉత్కంఠగా రాజకీయం!

Udayagiri: ఉదయగిరి నియోజకవర్గంలో ముగిసిన ఎంపీటీసీ నామినేషన్లు. 8 మండలాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల జోరు, ఎన్నికల రాజకీయం వేడెక్కింది.

VENKATA PRASAD, UDAYAGIRI
Published on: 23 Oct 2026 10:56 PM IST
Udayagiri
X

Udayagiri: ఉదయగిరిలో ముగిసిన ఎంపీటీసీ నామినేషన్ల పర్వం ఉత్కంఠగా రాజకీయం!

ఉదయగిరి: నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో నామినేషన్ల దాఖలు పూర్తికావడంతో రాజకీయంగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధానంగా టీడీపీ, వైసీపీ మధ్య పోటీ నెలకొనగా.. జనసేన, బీజేపీతో పాటు ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు.

ఉదయగిరి మండలంలో మొత్తం 98 నామినేషన్లు దాఖలయ్యాయి. టీడీపీ నుంచి 44, వైసీపీ నుంచి 36, జనసేన నుంచి 5, సీపీఎం నుంచి ఒకటి, స్వతంత్ర అభ్యర్థులుగా 12 నామినేషన్లు వచ్చాయి. బీజేపీ నుంచి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.

జలదంకి మండలంలో 85 నామినేషన్లు దాఖలు కాగా.. టీడీపీ నుంచి 37, వైసీపీ నుంచి 38 నామినేషన్లు వచ్చాయి. బీజేపీ నుంచి 3, జనసేన నుంచి ఒకటి, స్వతంత్ర అభ్యర్థులుగా 6 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక్కడ టీడీపీ, వైసీపీ మధ్య నామినేషన్ల విషయంలో స్వల్ప తేడా కనిపించింది.

కొండాపురం మండలంలో మొత్తం 73 నామినేషన్లు దాఖలయ్యాయి. టీడీపీ నుంచి 30, వైసీపీ నుంచి 34, బీఎస్పీ నుంచి 2, బీజేపీ నుంచి 3, జనసేన నుంచి 2, స్వతంత్ర అభ్యర్థులుగా 2 నామినేషన్లు వచ్చాయి. ఈ మండలంలో వైసీపీ అభ్యర్థులు ఎక్కువ నామినేషన్లు దాఖలు చేశారు.

కలిగిరి మండలంలో 76 నామినేషన్లు దాఖలయ్యాయి. టీడీపీ నుంచి 35, వైసీపీ నుంచి 37, జనసేన నుంచి ఒకటి, బీఎస్పీ నుంచి 2, స్వతంత్ర అభ్యర్థిగా ఒక నామినేషన్ వచ్చింది. ఇక్కడ కూడా రెండు ప్రధాన పార్టీల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది.

వింజమూరు మండలంలో అత్యధికంగా 106 నామినేషన్లు దాఖలయ్యాయి. టీడీపీ నుంచి 42, వైసీపీ నుంచి 56, బీజేపీ నుంచి 2, కాంగ్రెస్ నుంచి ఒకటి, జనసేన నుంచి 2, స్వతంత్ర అభ్యర్థులుగా 3 నామినేషన్లు వచ్చాయి. ఈ మండలంలో వైసీపీ అభ్యర్థులు అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు.

వరికుంటపాడు మండలంలో మొత్తం 73 నామినేషన్లు దాఖలయ్యాయి. టీడీపీ నుంచి 34, వైసీపీ నుంచి 21, బీజేపీ నుంచి 4, జనసేన నుంచి 2, స్వతంత్ర అభ్యర్థులుగా 12 నామినేషన్లు వచ్చాయి. ఈ మండలంలో టీడీపీ ఎక్కువ నామినేషన్లతో ముందంజలో నిలిచింది.

దుత్తలూరు మండలంలో 51 నామినేషన్లు దాఖలయ్యాయి. టీడీపీ నుంచి 24, వైసీపీ నుంచి 19, జనసేన నుంచి ఒకటి, బీజేపీ నుంచి ఒకటి, సీపీఎం నుంచి 3, కాంగ్రెస్ నుంచి ఒకటి, స్వతంత్ర అభ్యర్థులుగా 2 నామినేషన్లు వచ్చాయి.

సీతారామపురం మండలంలో మొత్తం 78 నామినేషన్లు దాఖలయ్యాయి. టీడీపీ నుంచి 42, వైసీపీ నుంచి 25, జనసేన నుంచి 11 నామినేషన్లు వచ్చాయి. ఈ మండలంలో టీడీపీ అత్యధిక నామినేషన్లతో ముందంజలో నిలిచింది.

మొత్తంగా ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ పూర్తవడంతో ఎన్నికల రాజకీయం వేడెక్కింది. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ అనంతరం బరిలో నిలిచే అభ్యర్థులపై స్పష్టత రానుంది. ఆ తర్వాత ఎన్నికల ప్రచారం ఏ స్థాయిలో సాగుతుంది.. ఓటర్లు ఎవరికి పట్టం కడతారన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

VENKATA PRASAD, UDAYAGIRI

VENKATA PRASAD, UDAYAGIRI