Nellore: ఉదయగిరిలో డ్రగ్స్ నిర్మూలనపై పోలీసుల విస్తృత అవగాహన సదస్సు!

Nellore: మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసులు, ‘ఈగిల్’ బృందంతో కలిసి ఎంఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరియు గండిపాలెం మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించారు.

VENKATA PRASAD, UDAYAGIRI
Published on: 4 Aug 2026 10:29 PM IST
Nellore
X

Nellore: ఉదయగిరిలో డ్రగ్స్ నిర్మూలనపై పోలీసుల విస్తృత అవగాహన సదస్సు!

నెల్లూరు: నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

ఉదయగిరి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో, ఈగిల్ (EAGLE) బృందం సహకారంతో ఉదయగిరిలోని ఎంఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలతో పాటు గండిపాలెం మోడల్ స్కూల్‌లో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించారు.

కళాశాల, పాఠశాల యాజమాన్యాల సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో విద్యార్థులకు డ్రగ్స్, మాదకద్రవ్యాల వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు.డ్రగ్స్‌కు దూరంగా ఉండి చదువుపై దృష్టి సారించాలని, చెడు అలవాట్లకు బానిస కాకుండా మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని విద్యార్థులకు సూచించారు.

అనుమానాస్పదంగా మాదకద్రవ్యాల విక్రయాలు లేదా వినియోగం కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.ఈ కార్యక్రమాల్లో ఉదయగిరి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వెంకటరావు, ఉదయగిరి ఎస్సై మహేంద్ర, ఈగిల్ బృందం సభ్యులు, పోలీసు సిబ్బంది, ఎంఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు, గండిపాలెం మోడల్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

VENKATA PRASAD, UDAYAGIRI

VENKATA PRASAD, UDAYAGIRI

Next Story