Kaluval: కలవాయిలో ఉల్లాస్ అక్షర ఆంధ్రకార్యక్రమంలో వివాదం!

Kaluval: కలువాయిలో వయోజన విద్యాశాఖ ఉల్లాస్ అక్షర ఆంధ్ర ర్యాలీలో ప్రధాని మోదీ ఫోటో లేకపోవడంపై విమర్శలు. ప్రోగ్రామ్‌లో ఏపీఎంకు అవమానం, వెలుగు సిబ్బంది అసహనం.

Madhav Goud, Nellore
Published on: 8 Sept 2026 2:02 PM IST
Kaluval
X

Kaluval: కలవాయిలో ఉల్లాస్ అక్షర ఆంధ్రకార్యక్రమంలో వివాదం!

Kaluval: 60 వ అంతర్జాతీయ అక్షరాస్యత కార్యక్రమం సందర్బంగా వయోజన విద్యా శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఉల్లాస్ అక్షర ఆంధ్ర కార్యక్రమం అధికారులు మమ అనిపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన అధికారులు చేశాం అంటే చేశాం అనిపించారు,ఈ కార్యక్రమానికి ముందుగా హైస్కూల్ వద్ద నుంచి బస్టాండ్, గ్రామ పురవీధుల్లో విద్యార్థుల తో కలసి అధికారులు భారీ ర్యాలీ నిర్వహించారు, ఈ సందర్బంగా ర్యాలీలో బ్యానర్ పై దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో లేకుండా ర్యాలీ నిర్వహించడం విమర్శలకు తావునిచ్చింది, ప్రజలు పోగ్రామ్ లో దేశ ప్రధాని ఫోటో లేకపోవడం పై గుస గుస లాడారు.

సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యా శాఖ మంత్రి లోకేష్ ఫొటోలు మాత్రమే దర్శనమిచ్చాయి,అక్షర ఆంధ్ర ప్రాజెక్టు జిల్లా అధికారులకు విద్యార్థుల చేత ఘనంగా స్వాగతం పలికారు. కానీ దేశ ప్రధాని ఫోటో మరిచారా లేక నిర్లక్ష్యమా అని ప్రజలు విమర్శలు గుప్పించారు. ఈ సందర్బంగా కలువాయి హైస్కూల్ లో జరిగిన అక్షర ఆంధ్ర కార్యక్రమం లో స్టేజ్ పైకి మండల స్థాయి అధికారులు ఆహ్వానం లేకుండా పోయింది.

ఈ పోగ్రామ్ డి ఆర్ డి ఏ, వెప్మా, డ్వామా పరిధిలో ని ఉపాధి హామీ శ్రామికుల సముక్తం గా నిర్వహించాలి. కానీ డి ఆర్ డి ఏ మండల స్థాయి అధికారి కి అవమానం జరిగింది. స్టేజ్ పైకి ఏపీఎం ను అధికారులు ఆహ్వానిచ్చక పోవడం తో వెలుగు సిబ్బంది అసహనం వ్యక్తం చేశారు. పోగ్రామ్ నుంచి వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకొన్నారు. వారిని ఏపీఎం బుజ్జగించారు.

ఉల్లాస్ అక్షర ఆంధ్ర కార్యక్రమం లో అక్షరాస్యత జిల్లా డిప్యూటీ డైరెక్టర్ మల్లు మస్తాన్ రెడ్డి,ఎంపీడీఓ శైలజ,హెచ్ ఎం అబ్బాస్ అలీ,ఎస్ ఎం సి చైర్మన్ మహేష్,వయోజన విద్యా కోఆర్డినేటర్ హారతి.ఏ పి ఎం రవి కుమార్, మండల టీడీపీ అధ్యక్షుడు రఘురామ్ రెడ్డి,విద్యార్థులు, పాల్గొన్నారు.

Madhav Goud, Nellore

Madhav Goud, Nellore

Next Story