Duttaluru: గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ మృతి!

Duttaluru: నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నందిపాడు వద్ద రోడ్డు దాటుతున్న మహిళను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందిన ప్రమాదం, కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

VENKATA PRASAD, UDAYAGIRI
Published on: 7 Oct 2026 12:37 PM IST
Duttaluru
X

Duttaluru: గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ మృతి!

Duttaluru: నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నందిపాడు వద్ద బుధవారం విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నందిపాడు శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన పుల్లమ్మ (55) రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది.

వాహనం ఢీకొట్టడంతో పుల్లమ్మ ఎగిరి రోడ్డు పక్కన ఉన్న చెట్లలో పడిపోయారు. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన వాహనం ఆగకుండా వెళ్లిపోయినట్లు సమాచారం. ఘటనపై దుత్తలూరు ఎస్సై సుభాషిణి కేసు నమోదు చేసి ప్రమాదానికి కారణమైన వాహనం కోసం దర్యాప్తు చేస్తున్నారు.

VENKATA PRASAD, UDAYAGIRI

VENKATA PRASAD, UDAYAGIRI