Nellore: పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో ప్రచారంలో వేగం పెంచిన ఊటుకూరు బ్రదర్స్!
Nellore: నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో 23వ డివిజన్ వైఎస్సార్సీపీ అభ్యర్థి ఊటుకూరు చైతన్య, ఆయన సోదరుడు నాగార్జున జోరుగా ప్రచారం.
Nellore: పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో ప్రచారంలో వేగం పెంచిన ఊటుకూరు బ్రదర్స్!
Nellore: నగరపాలక సంస్థ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో 23వ డివిజన్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఊటుకూరు చైతన్య, ఆయన సోదరుడు ఊటుకూరు నాగార్జున ప్రచారాన్ని ముమ్మరం చేశారు. డివిజన్ పరిధిలోని యలమవారిదిన్నెలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ స్థానిక ఓటర్లను కలుసుకున్నారు.
ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో డివిజన్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఊటుకూరు నాగార్జున ప్రజలకు వివరించారు. తమ అభ్యర్థి ఊటుకూరు చైతన్యకు మద్దతు తెలిపి ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు.
అనంతరం ఊటుకూరు చైతన్య మాట్లాడుతూ పార్టీలను మాత్రమే ప్రాతిపదికగా తీసుకోకుండా అభ్యర్థి పనితీరు, ప్రజలకు అందుబాటులో ఉండే విధానం, స్థానిక సమస్యలపై అవగాహన వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఓటు వేయాలని కోరారు. ఇంటింటి ప్రచారంలో స్థానికులను కలుసుకుంటూ తమకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.




