Kovur: జనసేనకు షాక్.. నల్లపరెడ్డి సమక్షంలో వైసీపీలోకి ఉయ్యురు మణికంఠ!
Kovur: కోవూరు మండలానికి చెందిన ఉయ్యురు మణికంఠ తన మిత్రులతో కలిసి జనసేనకు రాజీనామా చేసి, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు.
Kovur: జనసేనకు షాక్.. నల్లపరెడ్డి సమక్షంలో వైసీపీలోకి ఉయ్యురు మణికంఠ!
Kovur: జనసేన పార్టీకి రాజీనామా చేసిన కోవూరు మండలానికి చెందిన ఉయ్యురు మణికంఠ తన మిత్రులతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉయ్యురు మణికంఠతో పాటు సంతోష్, నరేష్, కార్తీక్, రవి కిరణ్, రవి, సాయి కిరణ్, మహేష్, కరీముల్లా, శివ, స్టాలిన్ తదితరులు జనసేన పార్టీని వీడి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సమక్షంలో వారంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా ప్రసన్నకుమార్ రెడ్డి వారికి కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, శివుని నరసింహారెడ్డి, అత్తిపల్లి అనూప్ రెడ్డి, కలికి శ్రీధర్ రెడ్డి, కూట్ల ఉమా తదితర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.




