Nellore: అమరావతికి కేంద్రం రాజముద్ర.. నెల్లూరులో వేమిరెడ్డి దంపతుల దీపోత్సవం!

Nellore: ఏపీ రాజధానిగా అమరావతికి శాశ్వత భద్రత దక్కడంపై నెల్లూరులో టీడీపీ శ్రేణుల ఉత్సాహం. వేమిరెడ్డి దంపతుల దీపోత్సవం మరియు స్వీట్ల పంపిణీ.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 3 April 2026 10:02 AM IST
Nellore
X

Nellore: అమరావతికి కేంద్రం రాజముద్ర.. నెల్లూరులో వేమిరెడ్డి దంపతుల దీపోత్సవం!

Nellore: రాజధానిగా అమరావతికి కేంద్రం రాజముద్ర వేయడంతో.. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది.. గురువారం సాయంత్రం వీఆర్సీ సెంటర్ నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు.. టిడిపి పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు రేవతి ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో.. మహిళలు జాతీయ జెండాలతో పెద్ద ఎత్తున పాల్గొని, దేవతల రాజధాని వర్ధిల్లాలి అంటూ గళమెత్తారు.. బాణా సంచాల మోతతో గాంధీ బొమ్మ సెంటర్ మార్మోగిపోయింది.. భారీ కేక్ కటింగ్ , స్వీట్లు పంపిణీతో టిడిపి నేతలు, నగరవాసులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.. అమరావతికి లైన్ క్లియర్ చేసిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.. ఈ విజయం రాష్ట్ర భవిష్యత్తుకు శుభసూచకమని సిటీ నియోజకవర్గ ప్రజల సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు దీపాలు వెలిగించి సెలబ్రేట్ చేసుకున్నారు.

అమరావతి బిల్లుకు పార్లమెంట్‌లో ఆమోదం లభించడంపై నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం దీపాలు వెలిగించి తమ మద్దతు తెలిపి హర్షాతిరేకాలు తెలియజేశారు. ఇది ప్రజా రాజధాని అని.. నా రాజధాని అమరావతి అంటూ గర్వంగా చాటాలన్నారు. ఇది ప్రజా ప్రభుత్వం సాధించిన విజయమన్నారు. జై అమరావతి నినాదాలతో హోరెత్తించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story