Kodavaluru: పెమ్మారెడ్డిపాళెంలో యువత నిర్మించిన పార్కు ప్రారంభించిన MP వేమిరెడ్డి!

Kodavaluru: పెమ్మారెడ్డిపాళెంలో బద్దిపూడి సూర్య సొంత నిధులతో అభివృద్ధి చేసిన పార్కును ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ప్రారంభించారు.

K.Sriharibabu, Kovur (Nellore Dsct)
Published on: 1 Sept 2026 8:47 AM IST
Kodavaluru
X

Kodavaluru: పెమ్మారెడ్డిపాళెంలో యువత నిర్మించిన పార్కు ప్రారంభించిన MP వేమిరెడ్డి!

Kodavaluru: నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం పెమ్మారెడ్డిపాళెంలో టీడీపీ మండల యువత అధ్యక్షుడు బద్దిపూడి సూర్య సొంత నిధులతో అభివృద్ధి చేసిన పార్కును నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రారంభించారు. గ్రామాభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావడం అభినందనీయమని ఎంపీ పేర్కొన్నారు.

సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన P4 స్ఫూర్తిని పెమ్మారెడ్డిపాళెం యువత ఆచరణలో చూపించారని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అన్నారు.పెమ్మారెడ్డిపాళెం గ్రామాభివృద్ధికి స్థానిక యువత ముందుకు రావడంపై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. యువత సొంత డబ్బు, శ్రమతో పార్కును అభివృద్ధి చేయడం అభినందనీయమన్నారు.

గ్రామంలో గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రూ.63.08 లక్షల విలువైన అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. ఇరిగేషన్, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల ద్వారా పలు అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.పెమ్మారెడ్డిపాళెం నుంచి రమణారెడ్డిగుంట వరకు సీసీ రోడ్లు, విద్యుత్ లైన్లు, మూడు ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్లు, డ్రైనేజీ, తాగునీటి సదుపాయాలకు నిధులు కేటాయించినట్లు తెలిపారు.

గ్రామానికి అవసరమైన మరిన్ని అభివృద్ధి పనులకు ఎంపీ ల్యాడ్స్‌, వీపీఆర్ ఫౌండేషన్ తరఫున పూర్తి సహకారం అందిస్తామని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి హామీ ఇచ్చారు.

K.Sriharibabu, Kovur (Nellore Dsct)

K.Sriharibabu, Kovur (Nellore Dsct)

Next Story