Nellore: చంద్రబాబు,లోకేష్ సమక్షంలో బాధ్యతలు చేపట్టిన కోవూరు ఎమ్మెల్యే
Nellore: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు.
Nellore: చంద్రబాబు,లోకేష్ సమక్షంలో బాధ్యతలు చేపట్టిన కోవూరు ఎమ్మెల్యే.
Nellore:"తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలిగా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రమాణ స్వీకారం"కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలుగుదేశం పార్టీలో కీలక బాధ్యతలను స్వీకరించారు. పార్టీ అత్యున్నత విధాన నిర్ణయాత్మక కమిటీ అయిన పొలిట్ బ్యూరో సభ్యురాలిగా ఆమె మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో ఆమె ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు.
ప్రమాణ స్వీకారం అనంతరం వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ..తనపై నమ్మకం ఉంచి ఇంతటి కీలకమైన బాధ్యతను అప్పగించినందుకు పార్టీ అధినాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయడానికి కార్యకర్తలకు అండగా ఉండటానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కోవూరు నియోజకవర్గ అభివృద్ధితో పాటు రాష్ట్ర స్థాయిలో పార్టీ అప్పగించే ఏ బాధ్యతనైనా చిత్తశుద్ధితో నిర్వహిస్తానని ఆమె ఈ సందర్బంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పొలిట్ బ్యూరో సభ్యురాలిగా పదవి బాధ్యతల చేపట్టిన సందర్బంగా, పలువురు టిడిపి రాష్ట్ర నాయకులు మరియు కోవూరు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ఆమెకు అభినందనలు తెలియజేశారు.
పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ....తమ మీది గౌరవంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువ నేత నారా లోకేష్ బాబులు తమకు ఉన్నత పదవులు కట్టబెట్టారని, వారి ఆశయాలకు అనుగుణంగా మా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్పారు. ఎంతటి ఉన్నత పదవుల్లో తాము ఉన్నప్పటికిని కార్యకర్తల్లాగా పని చేస్తామని చెప్పారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.




