Nellore: వైఆర్ జూనియర్ కళాశాల స్వర్ణోత్సవాలు.. హాజరైన వెంకయ్య నాయుడు!
Nellore: వింజమూరులోని వైఆర్ జూనియర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Nellore: వైఆర్ జూనియర్ కళాశాల స్వర్ణోత్సవాలు.. హాజరైన వెంకయ్య నాయుడు!
Nellore: నెల్లూరు జిల్లా వింజమూరు పట్టణంలోని వైఆర్ జూనియర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలు మంగళవారం అట్టహాసంగా నిర్వహించారు. కళాశాల 50 ఏళ్ల విద్యా ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ వేడుకలకు మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
కార్యక్రమానికి విచ్చేసిన వెంకయ్య నాయుడు, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌లకు కళాశాల యాజమాన్యం, పూర్వ విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి స్వర్ణోత్సవ వేడుకలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వైఆర్ జూనియర్ కళాశాల 50 ఏళ్ల ప్రస్థానంలో ఎంతోమంది విద్యార్థుల జీవితాలకు బాటలు వేసిందని పేర్కొన్నారు. కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. వారి సమష్టి కృషి ఫలితంగానే స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించగలిగామని తెలిపారు.
కళాశాల మరింత అభివృద్ధి చెంది భవిష్యత్ తరాలకు మంచి విద్యా కేంద్రంగా నిలవాలని ఆకాంక్షించారు. వేడుకల్లో పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు, విద్యార్థులు, కళాశాల అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో కళాశాల ప్రాంగణం సందడిగా మారింది.




