RIE నిర్మాణ పనులను పరిశీలించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు!

Nellore: నెల్లూరు జిల్లా వెంకటాచలంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న RIE పనులను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పరిశీలించారు.

V. Narasimhulu, Nellore
Published on: 5 July 2026 9:19 AM IST
Nellore
X

RIE నిర్మాణ పనులను పరిశీలించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు!

Nellore: శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, వెంకటాచలం మండలంలో జాతీయ రహదారికి దగ్గరలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (RIE) - NCERT నిర్మాణ పనులను పర్యవేక్షించారు. డిసెంబర్ 27, 2016న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న తాను, నాటి మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ కలిసి ఈ సంస్థ నిర్మాణానికి పునాది రాయి వేశామని చెప్పారు.

ఈ సంస్థ నిర్మాణం పూర్తైతే... B.Sc/BA B.Ed, M.Ed మరియు Ph.D వంటి ఉపాధ్యాయ విద్యా కోర్సులు అందుబాటులో వస్తాయని తెలిపారు. అంతే కాకుండా విద్యపై పరిశోధనలు చేయడం, ఉపాధ్యాయులు మరియు విద్యా బోధకుల నైపుణ్యాలను పెంచడం, మరియు ప్రభుత్వ పథకాలైన SSA, RMSA, ICT వంటి వాటిని పాఠశాలల్లో మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ఇది సహాయపడుతుందని అన్నారు.

వివిధ కారణాల వల్ల ఎంతో కాలంగా వాయిదా పడిన రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (RIE), నెల్లూరు నిర్మాణ పనులు తిరిగి ప్రారంభం కావడం ఆనందదాయకం అని చెప్పారు. శరవేగంగా ఈ పనులు పూర్తి చేసుకుని, ఈ సంస్థ అందుబాటులోకి రావాలని, ఆంధ్రప్రదేశ్ సహా... దేశ విద్యా రంగానికి ఈ సంస్థ మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు వెంకయ్య నాయుడు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story