Nellore: సైదాపురంలో కూటమి రెండేళ్ల విజయోత్సవ సభ

Nellore: నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం సైదాపురంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా భారీ విజయోత్సవ ర్యాలీ, సభ నిర్వహించారు.

V. Narasimhulu, Nellore
Published on: 16 Jun 2026 8:05 PM IST
Nellore
X

Nellore: సైదాపురంలో కూటమి రెండేళ్ల విజయోత్సవ సభ

Nellore: కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా.. నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గ స్థాయి విజయోత్సవ సభను సైదాపురంలో టిడిపి, బిజెపి, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, భారీ ర్యాలీ నిర్వహించారు..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ..

వెంకటగిరి నియోజకవర్గంలో రూ.1800 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, సైదాపురం మండలంలో తాగునీటి సమస్య తీర్చేందుకు, రాపూరు పెద్ద చెరువును రిజర్వాయర్‌గా మారుస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని మోడీ,చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కృషితో అభివృద్ధి, రాష్ట్ర పురోగతికి కూటమి నేతలు అహర్నిశలు శ్రమిస్తున్నారని చెప్పారు.

కూటమి ప్రభుత్వం కి సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు అని, చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని సమానంగా ముందుకు తీసుకెళ్తున్నామని వెల్లడి చేశారు.

పెన్షన్ల కోసం రూ.33వేల కోట్లు, రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేస్తోందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందుతున్నాయని పేర్కొన్నారు.

గత రెండేళ్లలో గొడ్డలి పార్టీ వైసీపీ, రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగించిందని ఎమ్మెల్యే రామకృష్ణ ఎద్దేవా చేశారు. నదుల అనుసంధానమే ధ్యేయం.. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు సీఎం చంద్రబాబు, నదుల అనుసంధానానికి ప్రాధాన్యత ఇస్తున్నారని వెల్లడించారు.

సైదాపురంలో జరిగిన విజయోత్సవ సభకు టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు మరియు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story