Nellore: ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సువర్ణరాజుతో భేటీ
Nellore: విజయవాడలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణరాజును కలిసిన ఆత్మకూరు మండల వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు తోడేటి అశోక్.
Nellore: ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సువర్ణరాజుతో భేటీ
నెల్లూరు: ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణరాజు ను విజయవాడలో మండల వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు తోడేటి అశోక్ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఇరువురం ఎంతో ఆప్యాయంగా, ఆత్మీయంగా పలకరించుకొని ఎస్సీ ఎస్టీ వర్గాలకు జరుగుతున్న అన్యాయాలపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించుకున్నారు.
ఈ సందర్భంగా నెల్లూరు జిల్లాలోని కుల సంఘాల మధ్య ఐక్యత,సమన్వయం మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరంపై లోతుగా చర్చించుకున్నారు.
అణగారిన వర్గాల అభ్యున్నతికి అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన ఆవశ్యకతను దాసరి సువర్ణరాజు నొక్కి చెప్పారన్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు న్యాయం జరిగేలా ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటు కోసం జరుగుతున్న పోరాటానికి మద్దతు తెలపాలని కోరారు, దానికి తోడేటి అశోక్ సానుకూలంగా స్పందించారు.సామాజిక న్యాయం, పరస్పర సహకారం లక్ష్యంగా భవిష్యత్తులో కలిసి పనిచేయాలని ఇరువురు అభిప్రాయపడ్డారు.




