Nellore: నెల్లూరు పెన్నా ఘాట్‌లో వినాయక నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన!

Nellore: నెల్లూరు పెన్నా ఘాట్ వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన విక్రమ సింహపురి గణేష్ ఉత్సవ సమితి.. అధికారులకు పలు సూచనలు.

A Praveen, Nellore
Published on: 12 Sept 2026 7:58 AM IST
Nellore
X

Nellore: నెల్లూరు పెన్నా ఘాట్‌లో వినాయక నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన!

Nellore: విక్రమ సింహపురి గణేష్ ఉత్సవ సమితి బృందం నెల్లూరు రంగనాయకులపేట పెన్నా ఘాట్ వద్ద గణేష్ నిమజ్జనం కోసం జరుగుతున్న పనులను పరిశీలించారు.

అధికారులతో మాట్లాడుతూ నిమజ్జనం ప్రదేశం వద్ద నీటిమట్టం పెంచేందుకు అవసరమైన ఇసుక బస్తాలు వెయ్యాలని మొబైల్ మొరుగుదొడ్లు ఏర్పాట్లు చేయాలని పోతిరెడ్డి పాలెం సెంటర్ నుంచి వచ్చే వినాయక విగ్రహాల కోసం పెన్నా నది వంతెనపై లెవెలింగ్ గడ్డలను స్వాగత స్టేజి నిర్మాణం మూలిక వస్తువులు పరిశీలించారు.

సంతపేట రంగనాయకులపేట గోపురం వీధి ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీస్ నియంత్రణ దేవాదాయ శాఖ వారి ప్రసాద వినియోగం కేంద్రాలను అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో విక్రమ గణేష్ ఉత్సవ సమితి గౌరవాధ్యక్షులు పిట్టి సత్య నాగేశ్వరరావు అధ్యక్షులు కొండపల్లి శ్రీకాంత్ ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి ఏవిఆర్ మోహన్ రావు హర్షవర్ధన్ శివకుమార్ ఆచారి కె.వి సుధీర్ పలువురు బృందం పాల్గొన్నారు.

A Praveen, Nellore

A Praveen, Nellore