Nellore: వీఎస్‌యూ కళాశాల 16వ వార్షికోత్సవ వేడుకలు.. ప్రముఖుల సందడి

Nellore: నెల్లూరు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ కళాశాల 16వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది.

V. Narasimhulu, Nellore
Published on: 25 April 2026 9:21 PM IST
Nellore
X

Nellore: వీఎస్‌యూ కళాశాల 16వ వార్షికోత్సవ వేడుకలు.. ప్రముఖుల సందడి

Nellore: నెల్లూరు "విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ (వీఎస్‌యూ) కళాశాల 16వ వార్షికోత్సవ వేడుకలు శనివారం అత్యంత వైభవంగా జరిగాయి. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ ప్రముఖులు, విద్యావేత్తలు హాజరై సందడి చేశారు.

"జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభం"

కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వీఎస్‌యూ ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యులు డా. బీద మస్తాన్ రావు యాదవ్, సర్వేపల్లి శాసనసభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరయ్యారు. విశిష్ట అతిథిగా రిజిస్ట్రార్ డా. కె. సునీత, గౌరవ అతిథులుగా జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీమతి పి. వెంకట లక్షుమ్మ, కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సిహెచ్. విజయ, డీన్ డా. ఆర్. ప్రభాకర్ పాల్గొన్నారు. అతిథులందరూ కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు.

"అతిథుల ప్రసంగాలు - విద్యార్థులకు దిశానిర్దేశం"

ఈ సందర్భంగా అతిథులు విద్యార్థులను ఉద్దేశించి స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేశారు. ఆచార్య అల్లం శ్రీనివాసరావు (VC):- కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా, ప్రస్తుత పోటీ ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులు నైపుణ్యాభివృద్ధి (Skill Development) పై ప్రత్యేక దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.

డా. బీద మస్తాన్ రావు యాదవ్ (MP):- యువతకు స్పష్టమైన లక్ష్యాలు ఉండాలని, క్రమశిక్షణతో కూడిన కృషి ఉంటేనే ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని ఆకాంక్షించారు.

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (MLA):-

విద్యార్థులు సామాజిక స్పృహ కలిగి ఉండాలని సూచించారు. పట్టుదల ఉంటే అసాధ్యమైనది ఏదీ లేదని, సమాజ శ్రేయస్సు కోసం విద్యను వినియోగించాలని కోరారు.

"ప్రతిభా పురస్కారాల ప్రదానం'

వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ క్రీడలు, సాంస్కృతిక పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. ఈ వేడుకతో వీఎస్‌యూ ప్రాంగణంలో కోలాహల వాతావరణం నెలకొంది.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story