Atmakur: నువ్వూరుపాడు, అశ్వినిపురం గ్రామాల్లో ఉచిత కంటి పరీక్షలు!
Atmakur: ఆత్మకూరు మండలం నువ్వూరుపాడు పంచాయతీలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 400 మందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు.
Atmakur: నువ్వూరుపాడు, అశ్వినిపురం గ్రామాల్లో ఉచిత కంటి పరీక్షలు!
ఆత్మకూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విపిఆర్ నేత్ర ఉచిత కంటి వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నువ్వరుపాడు పంచాయతీ పరిధిలోని అశ్వినిపురం, నువ్వూరుపాడు గ్రామాల్లో బుధవారం శిబిరాలు నిర్వహించారు.
విపిఆర్ నేత్ర చీఫ్ కోఆర్డినేటర్ ఎన్. శంకర్ ఆధ్వర్యంలో యూనిట్ ఇన్‌చార్జి కొండ్రెడ్డి రమణారెడ్డి, గ్రామ టీడీపీ అధ్యక్షుడు షేక్ మస్తాన్‌వలి, ప్రధాన కార్యదర్శి షేక్ ఖాజావలి, యువ నాయకుడు వీరపురెడ్డి సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు. అశ్వినిపురంలో సుమారు 250 మంది, నువ్వూరుపాడులో 150 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. అర్హులకు ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేయడంతో పాటు అవసరమైన ఆరోగ్య సూచనలు అందజేశారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో విపిఆర్ ఫౌండేషన్ పేదలకు ఆరోగ్య సేవలు అందిస్తోందన్నారు. కంటి వైద్యం, వికలాంగులకు ట్రైసైకిళ్ల పంపిణీ, ఉచిత విద్య వంటి సేవా కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు. పట్టణాలకు వెళ్లి వైద్యం చేయించుకోలేని పేదలకు గ్రామాల్లోనే ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడం ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ఈ సేవా కార్యక్రమాలను అందిస్తున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆయన సతీమణి ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు.




