Atmakur: నిర్లక్ష్యం వద్దు జ్వరం వస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లండి
Atmakur: నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని విఆర్వో కార్యాలయ సచివాలయాన్ని డాక్టర్ సాయి ప్రసన్న సందర్శించి ఏఎన్‌ఎం రికార్డులను తనిఖీ చేశారు.
Atmakur: నిర్లక్ష్యం వద్దు జ్వరం వస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లండి
ఆత్మకూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని వీఆర్వో కార్యాలయ పరిధిలోని సచివాలయాన్ని డాక్టర్ సాయి ప్రసన్న సందర్శించి క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎన్‌ఎం షేక్ రమీజా నిర్వహిస్తున్న వివిధ ఆరోగ్య సంబంధిత రికార్డులు,రిజిస్టర్లు మరియు నమోదులను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా డాక్టర్ సాయి ప్రసన్న మాట్లాడుతూ ఆరోగ్య సేవల అమలులో రికార్డుల నిర్వహణ అత్యంత కీలకమైన అంశమని పేర్కొన్నారు. ప్రతి ఆరోగ్య కార్యక్రమానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయడంతో పాటు, ప్రతి రిజిస్టర్‌ను పూర్తి సమాచారంతో, నిర్దేశిత విధానాల ప్రకారం నిర్వహించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని సకాలంలో నమోదు చేయడం ద్వారా ప్రజారోగ్య సేవలు మరింత సమర్థవంతంగా అమలు చేయవచ్చని తెలిపారు.
అనంతరం హెల్త్ ఎడ్యుకేటర్ ఆఫీసర్ (HEO) శ్రీ సుధాకర్, హెల్త్ ప్రొవైడర్ శ్రీమతి పార్వతి,హెల్త్ అసిస్టెంట్ శ్రీ రవీందర్ రెడ్డి పాల్గొని డెంగ్యూ నివారణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రజలకు డెంగ్యూ వ్యాధి వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం,వారానికి ఒకసారి డ్రై డే పాటించడం, నీటి నిల్వ పాత్రలను శుభ్రపరచడం, దోమలు పెరిగే పరిస్థితులను నివారించడం,జ్వరం వచ్చినప్పుడు స్వీయ వైద్యం చేయకుండా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, ఆశా కార్యకర్తలు,ఆరోగ్య సిబ్బంది పాల్గొని డెంగ్యూ నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజల సహకారంతో డెంగ్యూ వ్యాధిని సమర్థవంతంగా నియంత్రించవచ్చని అధికారులు పేర్కొన్నారు.




