Nellore: కరెంటు వచ్చినా నీరు రాలేదు.. అధికారుల నిర్లక్ష్యంపై జనం ఫైర్!
Nellore: నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండలం పందిపాడు ఎస్సీ కాలనీలో నీటి ఎద్దడి.
Nellore: కరెంటు వచ్చినా నీరు రాలేదు.. అధికారుల నిర్లక్ష్యంపై జనం ఫైర్!
ఆత్మకూరు నెల్లూరు: నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండలం పందిపాడు గ్రామ ఎస్సీ కాలనీలో నీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురువుతున్నాయి. తాగడానికి, వాడకానికి నీరు లేక తీవ్ర ఇబ్బంది ఏర్పడడంతో ట్యాంకర్లను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ మొత్తం 35 కుటుంబాలు ఉండగా.. వంద మందికి పైగా జనాభా ఉన్నారు. ఆదివారం గాలివాన రావడంతో ఇక్కడి రక్షిత నీటి పథకం విద్యుత్తు తీగలు తెగిపోయాయి.
దాంతో నీటి సరఫరా నిలిచి పోయింది. చేతిపంపు సైతం చైను తెగిపోవడంతో మరమ్మతులకు గురయింది. విద్యుత్తు లైను తాత్కాలికంగా మరమ్మతులు చేసి ఇళ్లకు కరెంటు ఇచ్చారు కానీ రక్షిత పథకానికి పునరుద్దరించలేదు. దాంతో కాలనీ ప్రజలు నీటికి నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు.రెండు రోజులుగా ఒక్కో ట్యాంకరు రూ.500 చొప్పున కొను గోలు చేసి తెప్పించుకుంటున్నామని స్థానికులు చెబుతున్నారు. అధికారులు స్పందించి తాగునీటి పథకాన్ని వినియో గంలోకి తీసుకురావాలని వేడుకుంటున్నారు.




