AS Peta: వృధాగా పోతున్న నీరు.. పట్టించుకునే వారేరి

AS Peta: నెల్లూరు జిల్లా ఏఎస్ పేటలో నీటి వృథాపై స్థానికుల ఆందోళన.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 20 Jun 2026 12:31 PM IST
AS Peta
X

AS Peta: వృధాగా పోతున్న నీరు.. పట్టించుకునే వారేరి

నెల్లూరు జిల్లా: మండల కేంద్రమైన ఏఎస్ పేట యాత్ర స్థలంలో తాగునీటికి వాడుకునే నీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీళ్లు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు రావో తెలియదు.

మండల కార్యాలయాలకు వెళ్లే లైను పోలీస్ స్టేషన్స్ సమీపంలో యాత్రికుల కోసం గతంలో నాలుగు కులాయిలు బిగించారు. కుళాయిలు శిధిలావస్థకు చేరాయి. కొత్త కుళాయిలు బిగించకపోవుటతో ఆ లైనుకు నీళ్లు వదిలినప్పుడల్లా నీళ్లు వృధాగా పోతున్నాయి.

అధికారుల ఆ మార్గంలో వెళుతున్న పట్టించుకున్న దాఖలాలు లేవని ప్రజలు ఆరోపిస్తున్నారు. త్వరలో రొట్టెల పండగ జరగనుంది. ఏఎస్పేటకు వేలాదిమంది యాత్రికులు దుర్గా దర్శనానికి వస్తారు. ఎస్ పేటకు వచ్చేవారికి ప్రత్యేక సౌకర్యాలు అనగా లైటింగ్ నీళ్లు పారిశుధ్య o తదితర పనులు చేయాల్సి ఉంది. అందువల్ల నీటి వృధాను అరికట్టి ప్రజలకు సక్రమంగా నీరు అందించాలని కోరుతున్నారు.

ప్రత్యేక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి

ఏఎస్ పేటకు వేలాదిమంది యాత్రికులు మరో నాలుగు రోజుల్లో రానున్నడంవల్ల ప్రత్యేక మరుగుదొడ్లు నీటి వసతి కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. స్వచ్ఛ్ ఆంధ్ర పథకం లో ప్రత్యేకంగా అమలు చేయాలని కోరుతున్నారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత కల్పించాలి.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)

Next Story