Gudur: గూడూరు బస్టాండ్‌లో ప్రమాదం, బస్సు టైర్ కింద పడి మహిళ కాలుకు తీవ్ర గాయం!

Gudur: నెల్లూరు జిల్లా గూడూరు బస్టాండ్‌లో బస్సు ఎక్కే సమయంలో తోపులాట జరిగి టైర్ కింద పడి మహిళ కాలు నుజ్జునుజ్జు, మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలింపు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 6 Oct 2026 9:39 AM IST
Gudur
X

Gudur: గూడూరు బస్టాండ్‌లో ప్రమాదం, బస్సు టైర్ కింద పడి మహిళ కాలుకు తీవ్ర గాయం!

Gudur: నెల్లూరు జిల్లా గూడూరు బస్టాండ్ లో దారుణం చోటుచేసుకుంది. బస్సు ఎక్కే సమయంలో తోపులాటలో జారిపడి ఓ మహిళ బస్సు టైర్ కింద పడి కాలు నుజ్జునుజ్జు అయింది. మేఘనూరు గ్రామానికి చెందిన పోలమ్మ వయసు 50 సంవత్సరాలుఅనే మహిళ నెల్లూరుకు వెళ్లేందుకు గూడూరు బస్టాండ్ కు వచ్చింది. నెల్లూరు వెళ్లే బస్సు ఎక్కే సమయంలో తోపులాట జరగడంతో ఆమె అదుపుతప్పి జారి నేరుగా బస్సు టైర్ కింద పడిపోయింది. బస్సు టైర్ ఆమె కాలి మీదుగా దూసుకెళ్లడంతో కాలు నుజ్జునుజ్జుగా అయిపోయింది.గూడూరు ప్రభుత్వ హాస్పిటల్ కు తరలింపు, అక్కడి నుంచి

తీవ్ర గాయాలపాలైన పోలమ్మను స్థానికులు వెంటనే గూడూరు ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు, గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి నెల్లూరుకు తరలించారు. ప్రస్తుతం ఆమె నెల్లూరులో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. గూడూరు బస్టాండ్ లో భద్రతా చర్యలు లేకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్