Nellore: రేపే ప్రపంచ మలేరియా దినోత్సవం.. జిల్లా వ్యాప్తంగా ఏర్పాట్లు

Nellore: ఈ నెల 25న ప్రపంచ మలేరియా దినోత్సవం. కలెక్టరేట్‌లో గోడ పత్రికలు ఆవిష్కరించిన కలెక్టర్ హిమాన్షు శుక్లా.

V. Narasimhulu, Nellore
Published on: 24 April 2026 9:18 PM IST
Nellore
X

Nellore: రేపే ప్రపంచ మలేరియా దినోత్సవం.. జిల్లా వ్యాప్తంగా ఏర్పాట్లు

Nellore: ఈ నెల 25న (శనివారం) నిర్వహించనున్న ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా. శుక్రవారం కలెక్టరేట్ నందు తన ఛాంబర్ నందు మలేరియా నివారణకు సంబంధించిన బ్యానర్లు, గోడపత్రికలు, కరపత్రికలను కలెక్టర్ ఆవిష్కరించారు.

2030 సంవత్సరానికి మలేరియా నిర్మూలనే అంతిమ లక్ష్యంగా “ఇప్పుడే మనం సాధించగలం – ఇప్పుడు మనం తప్పక సాధించాలి” అనే నినాదంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అన్ని మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు పట్టణ ఆరోగ్య కేంద్రాలలో సబ్ యూనిట్ అధికారుల ఆధ్వర్యంలో ర్యాలీలు, ప్రదర్శనలు, పాంప్లెట్ల పంపిణీ ద్వారా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి వైద్యులు మరియు వైద్య ఆరోగ్య సిబ్బంది చురుకుగా పాల్గొనాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డాక్టర్ వి. సుజాత, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ టి. అంశుదర్, ఇంచార్జి ఏఎంఓ ఓ. జయరాం, వివిధ సబ్ యూనిట్ అధికారులు మరియు డీఎంఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story