Atmakur: ఆత్మకూరు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ
Atmakur: ప్రపంచ జనాభా దినోత్సవం పురస్కరించుకుని ఆత్మకూరులో ర్యాలీ. కుటుంబ నియంత్రణ, మాతా-శిశు ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించిన వైద్యులు, సిబ్బంది.
Atmakur: ఆత్మకూరు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ
ఆత్మకూరు: ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని యూపీఎస్సీ అరుంధతి వాడ డా. సాయి ప్రసన్న ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీ ద్వారా ప్రజల్లో జనాభా నియంత్రణ,కుటుంబ నియంత్రణ, మాతా-శిశు ఆరోగ్యం, ఆరోగ్యకరమైన జీవన విధానం మరియు సామాజిక బాధ్యతలపై విస్తృతంగా అవగాహన కల్పించారు.
ర్యాలీలో హెచ్.ఈ.ఓ శ్రీ సుధాకర్, హెచ్.పీ శ్రీమతి పార్వతి, హెల్త్ అసిస్టెంట్ శ్రీ రవీందర్ రెడ్డి పాల్గొని ప్రపంచ జనాభా దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. చిన్న కుటుంబం – సంతోషకరమైన కుటుంబం,ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరి బాధ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.
యూపీహెచ్‌సీ సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. ప్రజలు కూడా ఉత్సాహంగా పాల్గొని ఆరోగ్య అవగాహన సందేశాలను స్వీకరించారు.ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన అధికారులకు, సిబ్బందికి, ఆశా కార్యకర్తలకు మరియు పాల్గొన్న ప్రజలందరికీ డా. సాయి ప్రసన్న కృతజ్ఞతలు తెలిపారు.




