Vidavaluru: ప్రకృతి ఒడిలో.. అలల జడిలో.. యోగాసనాలు

Vidavaluru: రామతీర్థం సాగర తీరంలో యోగాంధ్ర-2026 కార్యక్రమం. సాగర తీరంలో సామూహిక యోగా చేసిన జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు మరియు అధికారులు.

V. Narasimhulu, Nellore
Published on: 8 Jun 2026 9:37 AM IST
Vidavaluru
X

Vidavaluru: ప్రకృతి ఒడిలో.. అలల జడిలో.. యోగాసనాలు

Vidavaluru: అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ 21)ను పురస్కరించుకుని నిర్వహిస్తున్న యోగాంధ్ర-2026 కార్యక్రమంలో భాగంగా విడవలూరు మండలం రామతీర్థం సాగర తీరం వద్ద నిర్వహించిన సామూహిక యోగా కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది.

ప్రకృతి సోయగాల నడుమ, అలల సవ్వడుల మధ్య, యోగా ఔన్నత్యం ఉట్టిపడేలా ప్రత్యేక యోగా కార్యక్రమం నిర్వహించారు. అందమైన సాగర తీరం, ఆహ్లాదకరమైన వాతావరణంలో సామూహికంగా పాల్గొని, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు, యోగా సాధకులు, ప్రజలు యోగాసనాలు చేశారు.

యోగా ద్వారా శారీరక దారుఢ్యం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రతతో పాటు సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని పేర్కొన్నారు జాయింట్ కలెక్టర్.. యోగాలోని ప్రతి ఆసనం ప్రాముఖ్యత, ఆరోగ్య ప్రయోజనాలను వివరంగా తెలియజేస్తూ.. యోగాసనాలు చేయించిన యోగా గురువు డా.స్వప్న, జయంతి, యోషిత కు అభినందనలు తెలియజేశారు. ప్రకృతి ఒడిలో నిర్వహించిన ఈ యోగా కార్యక్రమం పాల్గొన్న వారిలో నూతన ఉత్సాహాన్ని నింపగా, యోగా పట్ల మరింత ఆసక్తిని పెంపొందించింది.

యోగాను ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగం చేయాలనే లక్ష్యంతో.. జిల్లావ్యాప్తంగా ఉత్సాహంగా కొనసాగుతున్న యోగాంధ్ర-2026 కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతున్నాయి.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story