Nellore: నెల్లూరు ఘనంగా వైఎస్సార్ 77వ జయంతి వేడుకలు
Nellore: నెల్లూరు రూరల్‌లో వైఎస్సార్ 77వ జయంతి వేడుకలు. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆనం అరుణమ్మ, ఆనం విజయ కుమార్ రెడ్డి. పేదల పాలిట దైవమని కొనియాడారు.
Nellore: నెల్లూరు ఘనంగా వైఎస్సార్ 77వ జయంతి వేడుకలు
నెల్లూరు: దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రివర్యులు డా" వై.యస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి సందర్భంగా జిల్లాపరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మ మరియు నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వై.యస్.ఆర్ జయంతి వేడుకలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మలిరెడ్డి కోటారెడ్డి పాల్గొన్నారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గ నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి నెల్లూరు రూరల్ నియోజకవర్గం, కరెంట్ ఆఫీస్ సెంటర్ నందు వై.యస్.ఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించి అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు.
దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి సేవలు చిరస్మరణీయమని పేదల పాలిట ప్రత్యక్ష దైవమని, పేదల పక్షపాతి వైయస్ రాజశేఖర్ రెడ్డి అని పలువురు నేతలు కొనియాడారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, 108, 104 సేవలు పేదల పాలిట వరాలని నేతలు గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు,జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు,నెల్లూరు రూరల్ నియోజకవర్గ సంఘాల అధ్యక్షులు,క్లస్టర్ ఇంచార్జిలు,డివిజన్ ఇన్చార్జులు,నెల్లూరు రూరల్ నియోజకవర్గ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు..




