Nellore: రాపూరు ఘనంగా వైఎస్సార్ జయంతి.. పండ్ల పంపిణీ
Nellore: రాపూరులో వైఎస్సార్ జయంతి వేడుకలు. విగ్రహానికి నివాళులర్పించిన కన్ను మధుసూదన్ రెడ్డి. రోగులకు పండ్లు పంపిణీ, 2029లో జగన్ గెలుపు ఖాయమని ధీమా.
Nellore: రాపూరు ఘనంగా వైఎస్సార్ జయంతి.. పండ్ల పంపిణీ
నెల్లూరు: నెల్లూరు జిల్లా రాపూరు పట్టణంలోని గ్రంథాలయం ప్రాంగణం వద్ద ఉన్న స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి వైఎస్ఆర్సిపి పార్టీ సీనియర్ నాయకులు కన్ను మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో పూలమాలవేసి కేక్ కట్ చేసి వైయస్సార్ జోహార్ అంటూ నినాదాలు చేసి అనంతరం రాపూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
అనంతరం పాప కన్ను మధుసూదన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి దేశానికే ఆదర్శమని ఆయన తెచ్చిన అనేక సంక్షేమ పథకాలు అటు తెలంగాణలోనూ మరి ఇతర రాష్ట్రాలలోనూ అమలవుతున్నాయని రాజకీయానికి వన్నెతెచ్చిన మహామనిషి పెద్దాయన వైయస్ రాజశేఖర్ రెడ్డి అని వైయస్ రాజశేఖర్ రెడ్డి తలపెట్టిన రాష్ట్ర అభివృద్ధి,అనేక సంక్షేమ కార్యక్రమాలు వైయస్ జగన్మోహన్ రెడ్డి తోనే సాధ్యమవుతుందని.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న పాలన రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని కచ్చితంగా 2029లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం ఖాయం అని తెలిపారు..ఈ కార్యక్రమంలో బత్తిన పట్టాభిరామరెడ్డి. బొడ్డు మధుసూదన్ రెడ్డి.దందోలు లక్ష్మీనారాయణ రెడ్డి. పోలంరెడ్డి పెంచల్ రెడ్డి.ఏటూరు మురళీమోహన్ రెడ్డి. డాక్టర్ ఖాదర్ భాషా.మరియు మండల వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




