Nellore: నెల్లూరులో విజయదశమి వేళ వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం!
Nellore: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు నగరంలోని పలు డివిజన్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఆలయాల్లో ప్రత్యేక పూజలతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
Nellore: నెల్లూరులో విజయదశమి వేళ వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం!
Nellore: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు నగరంలోని 65, 66, 68 డివిజన్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. దైవదర్శనం అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మజ్జిగ జయకృష్ణ, కొణిదల సుధీర్ హాజరయ్యారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచార కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజల పక్షాన నిలిచే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు తెలిపి, రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. విజయదశమి శుభసందర్భంగా ప్రారంభమైన ప్రచార కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొని అభ్యర్థులకు మద్దతు తెలిపారు.




