Nellore: మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను కలిసిన కార్పొరేటర్ కామాక్షి!

Nellore: నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచిన ఏకైక కార్పొరేటర్ కామాక్షి దంపతులు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

A Praveen, Nellore
Published on: 15 Nov 2026 7:25 AM IST
Nellore
X

Nellore: మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను కలిసిన కార్పొరేటర్ కామాక్షి!

Nellore: మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అనిల్ కుమార్ యాదవ్‌ను వైసీపీ కార్పొరేటర్ కామాక్షి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించిన ఏకైక కార్పొరేటర్‌గా కామాక్షి నిలిచారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ కామాక్షి దంపతులను మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అభినందించారు. వారి విజయంపై సంతోషం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వంగాల శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు.

A Praveen, Nellore

A Praveen, Nellore