Nellore: డీఎస్సీ అక్రమాలపై వైఎస్ఆర్సీపీ రిలే నిరాహార దీక్షలు!
Nellore: డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలని కోవూరులో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.
Nellore: డీఎస్సీ అక్రమాలపై వైఎస్ఆర్సీపీ రిలే నిరాహార దీక్షలు!
Nellore: నెల్లూరు జిల్లా కోవూరు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట కోవూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలి అంటూ రిలే నిరాహార దీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. డీఎస్సీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వాటిపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు.దీక్షలో పాల్గొనేందుకు కోవూరు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. వైఎస్ఆర్సీపీ న్యాయవాదుల విభాగం ప్రతినిధులు కూడా దీక్షలో పాల్గొని మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డికి సంఘీభావం తెలిపారు.
దీక్ష నేపథ్యంలో ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేపట్టి, వాహనాల రాకపోకలను నియంత్రించారు.




