Rapur: రాపూరులో తగ్గని ఫ్యాన్ గాలి కూటమికి గట్టి పోటీ ఇచ్చిన వైఎస్సార్సీపీ!
Rapur: ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో ఎంపీటీసీ ఫలితాల్లో కూటమికి వైఎస్సార్సీపీ గట్టి పోటీ ఇచ్చింది. స్థానాల్లో టీడీపీ ముందంజలో ఉన్నా తగ్గని వైసీపీ ఓటు బ్యాంక్.
Rapur: రాపూరులో తగ్గని ఫ్యాన్ గాలి కూటమికి గట్టి పోటీ ఇచ్చిన వైఎస్సార్సీపీ!
Rapur: నెల్లూరు జిల్లా రాపూరు మండల రాజకీయాల్లో ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు ఆసక్తికర చర్చకు తెరలేపుతున్నాయి. కలువాయి, సైదాపురం మండలాల్లో కూటమి పార్టీకి అనుకూల ఫలితాలు వచ్చినప్పటికీ, రాపూరు మండలంలో మాత్రం కూటమికి ఆశించిన స్థాయిలో ఆధిక్యం కనిపించలేదనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
స్థానాల సంఖ్యలో కూటమి ముందున్నప్పటికీ, మెజార్టీల విషయంలో మాత్రం ఆ పార్టీకి నిరాశే ఎదురైందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
రాపూరు మండలంలో మొత్తం 13 ఎంపీటీసీ స్థానాలకు గాను నాలుగు స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన తొమ్మిది స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో టీడీపీ ఐదు స్థానాలు గెలుచుకోగా, వైసీపీ నాలుగు స్థానాలను కైవసం చేసుకుంది.
అయితే టీడీపీ గెలుచుకున్న ఐదు స్థానాల్లోనూ తక్కువ మెజార్టీలు నమోదు కావడం గమనార్హం. మరోవైపు వైసీపీ అభ్యర్థులు గట్టి పోటీని ఎదుర్కొని నాలుగు స్థానాల్లో విజయం సాధించడం ఆ పార్టీకి మండలంలో ఉన్న పట్టును సూచిస్తోంది.
కూటమి గెలిచింది స్థానాలేనా..? ప్రజల మనసులు గెలిచిందా..? అన్న ప్రశ్న ఇప్పుడు రాపూరు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇతర మండలాల్లో కూటమి విజయాలు స్పష్టంగా కనిపించినా, రాపూరులో మాత్రం వైసీపీ ప్రభావం తగ్గలేదనే సంకేతాలు తాజా ఫలితాల్లో కనిపిస్తున్నాయని వైసీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.
ముఖ్యంగా స్వల్ప మెజార్టీలతో కూటమి అభ్యర్థులు గట్టెక్కడం, వైసీపీ అభ్యర్థులు చివరి వరకు పోటీలో నిలవడం చూస్తుంటే రాపూరు మండలంలో ఫ్యాన్ గాలి ఇంకా కొనసాగుతోందనే చర్చకు బలం చేకూరుతోంది.
కూటమి పార్టీ స్థానాల పరంగా పైచేయి సాధించినప్పటికీ, గ్రామస్థాయిలో వైసీపీకి ఉన్న రాజకీయ పునాదిని తక్కువగా అంచనా వేయలేని పరిస్థితి నెలకొందని స్థానిక రాజకీయ విశ్లేషణలు చెబుతున్నాయి.
పంచాయతీ ఎన్నికలే అసలు పరీక్ష.. రాపూరులో ఫ్యాన్ గాలి ఎంత బలమో తేలేదెప్పుడు?
ప్రస్తుతం జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు రానున్న పంచాయతీ ఎన్నికలకు రాజకీయంగా ఆసక్తిని పెంచుతున్నాయి. కూటమి పార్టీ తన విజయాన్ని విస్తరించుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుండగా, వైసీపీ మాత్రం తాజా ఫలితాలతో తన ఉనికిని చాటుకునే ప్రయత్నంలో ఉంది.
మొత్తానికి రాపూరు మండలంలో కూటమి ఐదు స్థానాలు, వైసీపీ నాలుగు స్థానాలు గెలుచుకున్నప్పటికీ.. మెజార్టీల పరంగా వెలువడిన ఫలితాలు మాత్రం రెండు పార్టీల మధ్య గట్టి పోటీని స్పష్టం చేస్తున్నాయి.
స్థానాల లెక్కలో కూటమి ముందున్నా.. రాజకీయ చర్చల్లో మాత్రం వైసీపీ ఫీవర్ హాట్ టాపిక్‌గా మారింది. రానున్న పంచాయతీ ఎన్నికల్లో రాపూరు రాజకీయ ముఖచిత్రం ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాలి!?.




