Nellore: ఎరువుల కొరతపై నెల్లూరు జేడీ ఆఫీస్ వద్ద వైసీపీ భారీ నిరసన!
Nellore: నెల్లూరు జిల్లాలో ఎరువుల కొరతపై వ్యవసాయ శాఖ జేడీ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) భారీ నిరసన.
Nellore: ఎరువుల కొరతపై నెల్లూరు జేడీ ఆఫీస్ వద్ద వైసీపీ భారీ నిరసన!
Nellore: రాష్ట్రంలోనూ.. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఎరువుల కొరత రైతులను వేధిస్తోందని మండిపడ్డారు మాజీ మంత్రి వైసిపి జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి.
ఈ సందర్భంగా ఎరువుల కొరతపై జెడి కార్యాలయం ఎదుట, పెద్ద ఎత్తున వైసీపీ నేతలు, కార్యకర్తలు, నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం వ్యవసాయ శాఖ జేడి సత్యవాణి కి వినతిపత్రం అందజేశారు... అనంతరం కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ...
ఎకరానికి ఒక బస్తా ఇస్తామన్న ప్రభుత్వం, రైతులు, తాము కలిసి ఆందోళన చేస్తే.. మూడు బస్తాలు ఇస్తామంటున్నారని, కానీ అవి కూడా సరిగ్గా పంపిణీ చేసిన దాఖలాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు.
యాప్ సమస్య వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రైతులకు ఎరువులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పారు. యాప్ లో నమోదు చేసుకుంటే.. ఎరువులు ఇస్తామని చెప్పడంతో.. కౌలు రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఎరువులు వాడకూడదని చెప్పిన
శ్రీలంక ప్రభుత్వాన్ని తరిమికొట్టినట్లు.. చంద్రబాబును కూడా ఏపీ ప్రజలు తరిమి కొట్టడం ఖాయం అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు కాకాణి గోవర్ధన్ రెడ్డి.




