Atmakur: ఆత్మకూరులో వైఎస్సార్‌సీపీకి ఎదురుదెబ్బ టీడీపీలోకి వలసలు!

Atmakur: నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వైసీపీకి భారీ షాక్. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిన పలు వార్డుల వైసీపీ నాయకులు, కార్యకర్తలు.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 25 Oct 2026 5:19 PM IST
Atmakur
X

Atmakur: ఆత్మకూరులో వైఎస్సార్‌సీపీకి ఎదురుదెబ్బ టీడీపీలోకి వలసలు!

Atmakur: నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఎన్డీఏ కూటమి పార్టీ కార్యాలయంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమక్షంలో ఆదివారం పట్టణంలోని 21, 22, 23, 24వ వార్డులకు చెందిన పలువురు వైసీపీ నాయకులు తమ అనుచరులతో తెలుగుదేశంలో చేరారు.ఆత్మకూరు మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారుతున్నాయి. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, డాక్టర్ బొమ్మిరెడ్డి తారకనాథ్ రెడ్డి సమక్షంలో, డాక్టర్ శ్రవణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో 21, 22, 23, 24వ వార్డులకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు టీడీపీలో చేరారు.దాంతో పార్టీ వర్గాల్లో మరింతగా జోష్ పెరిగింది.ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులకు కార్యకర్తలు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఇతర టీడీపీ నాయకులు స్వాగతం పలికారు. కూటమి అభ్యర్థుల విజయానికి కలిసికట్టుగా పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

ఈ చేరికలతో ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల వేళ టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు బొమ్మిరెడ్డి తారక్ నాథ్ రెడ్డి, ఆనం లీలా కైవల్యా రెడ్డి,తాళ్లూరు గిరినాయుడు,తుమ్మల చంద్రా రెడ్డి, చల్లా రవికుమార్ రెడ్డి,డాక్టర్ కే. వి. శ్రావణ్ కుమార్ రెడ్డి,ఇందూరు వెంకటరమణా రెడ్డి,సూరా భాస్కర్ రెడ్డి, దాసరి మధుసూదన్ రావు,మున్సిపల్ కౌన్సిలర్ టిడిపి అభ్యర్థులు,పలువురు టిడిపి నాయకులు, పాల్గొన్నారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)