Nellore: కూటమి ప్రభుత్వంపై ఎమ్మెల్సీ పర్వతరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Nellore: డీఎస్సీ 2025 ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో భారీ అక్రమాలు జరిగాయని, ఒక్కో పోస్టును రూ. 15 లక్షలకు అమ్ముకున్నారని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి ఆరోపణలు చేశారు.

V. Narasimhulu, Nellore
Published on: 23 May 2026 7:54 PM IST
Nellore
X

Nellore: కూటమి ప్రభుత్వంపై ఎమ్మెల్సీ పర్వతరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Nellore: టీచ‌ర్ పోస్టుల భ‌ర్తీలో భారీ అక్ర‌మాలు జరిగాయని, ఒక్కో పోస్టును రూ.15 ల‌క్ష‌ల‌కు అమ్మేసుకున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ ఇంచార్జి, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. ఆయన ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..

నోటిఫికేష‌న్ ఇచ్చిన ద‌గ్గ‌ర్నుంచి టీచ‌ర్ పోస్టుల భ‌ర్తీ వ‌ర‌కు అన్నింటా అవ‌క‌త‌వ‌క‌లే జరిగాయని, ఫస్ట్ ర్యాంక్ లేకుండా మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయ‌డం, ఆపై వెబ్‌సైట్ నుంచి దాన్ని కూడా తొల‌గించ‌డం అనుమానాస్పదం అని అన్నారు. మొద‌టి ర్యాంకు వ‌చ్చిన అభ్య‌ర్థికి ఉద్యోగం ఎందుకి ఇవ్వ‌లేదో ప్ర‌భుత్వం చెప్పాలి అని డిమాండ్ చేశారు. అత‌డు త‌ప్పు చేశాడని తీసేసి ఉంటే ప‌రీక్ష‌ల్లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని ప్ర‌భుత్వం ఒప్పుకున్న‌ట్టే కదా అని ప్రశ్నించారు.

బీఎడ్‌, టెట్ లేకుండా స్పోర్ట్స్ కోటాలో టీచ‌ర్ పోస్టులు భ‌ర్తీ చేయ‌డం నిబంధ‌న‌ల‌కు విరుద్ధం అని అన్నారు. డీఎస్సీ 2025 నిర్వ‌హ‌ణ‌పై సీబీఐ విచార‌ణ జ‌రిపించాలని డిమాండ్ చేశారు. 3.50 ల‌క్ష‌ల మంది టీచర్ అభ్య‌ర్థుల‌కు కూట‌మి ప్ర‌భుత్వం ద్రోహం చేసిందని చెప్పారు. అక్ర‌మాల‌తో న‌ష్ట‌పోయిన వారికి వైయస్సార్సీపీ ప్రభుత్వం వ‌చ్చాక న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

2014-19 మ‌ధ్య చంద్ర‌బాబు భ‌ర్తీ చేసింది 10వేల టీచ‌ర్ పోస్టులేనని, ఐదేళ్ల‌లో వైయ‌స్ జ‌గ‌న్ 21,108 టీచ‌ర్ పోస్టులు భ‌ర్తీ చేశారని గుర్తు చేశారు. ఏదేమైనా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు ప్రజల్లోనూ దుమారం రేపుతున్నాయి.. అధికార పక్షం ఈ వ్యాఖ్యలపై ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి మరి.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story