Nellore: హోరెత్తిన వైఎస్సార్‌సీపీ నిరసనలు: మెగా డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు డిమాండ్
Nellore: నెల్లూరు విఆర్సీ సెంటర్‌లో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రెండవ రోజు రిలే నిరాహార దీక్షలు జరిగాయి.
Nellore: హోరెత్తిన వైఎస్సార్‌సీపీ నిరసనలు: మెగా డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు డిమాండ్
నెల్లూరు: నెల్లూరు వి ఆర్సీ సెంటర్ లో వైస్సార్సీపీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ చార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో రెండో రోజు డియస్సి అక్రమాలపై రిలే నిరాహార దీక్షలు.. ఉదృతంగా సాగాయి.
ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, వైఎస్ఆర్సిపి రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత కూడా విచ్చేసి సంఘీభావం తెలిపారు. మెగా డియస్సిని దగా డియస్సిగా మార్చి..టీచర్ ఉద్యోగాలను అమ్ముకున్న విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామ చేయాలంటూ మహిళలు నినాదాలు చేశారు... లక్షలాదిమంది నిరుద్యోగులను... రోడ్డు మీద పెట్టిన మెగా డియస్సి అవినీతి అక్రమాలపై.. తక్షణమే సిబిఐ దర్యాప్తు.. జరిపించాలంటూ డిమాండ్ చేశారు.
ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మెగా డీఎస్సీ అక్రమాలతో రాష్ట్రంలో 3 లక్షల 50వేల మంది నిరుద్యోగులు దగాపడ్డారని అన్నారు. ఎలాంటి అర్హతలేని తమ తమ కార్యకర్తలకు .. కూటమి ప్రభుత్వం టీచర్ ఉద్యోగాలను అడ్డదారిలో కట్టబెట్టిందని ధ్వజమెత్తారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అనుసరించిన తప్పుడు విధానాలతో అన్ని అర్హతలు ఉండి ఉద్యోగం రాని ..ఎంతో మంది అభ్యర్డులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. టీచర్ ఉద్యోగాలను అమ్ముకొని... ప్రభుత్వం నిరుద్యోగుల గొంతు కోసిందన్నారు.ప్రభుత్వం తప్పు చేయకపోతే.
డియస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించేందుకు ఎందుకు నిరాకరిస్తుందో చెప్పాలన్నారు. ఈరోజు డీఎస్సీ అక్రమాలపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంటే.. ప్రజలకు సమాధానం చెప్పాల్సింది పోయి.. ఎలాంటి అవినీతి జరగలేదని ప్రభుత్వం కోర్టులను నమ్మించే ప్రయత్నం చేస్తుందన్నారు. ఈరోజు మెగా డీఎస్సీలో ప్రభుత్వం చేసిన తప్పులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా .. పూర్తి ఆధారాలతో ప్రజల ముందుంచినప్పుడు..CBI జరిపించకపోవడం శోచనీయమన్నారు.
టీచర్ ఉద్యోగాన్ని 15 లక్షలకు అమ్ముకున్న ఆడియో కాల్స్ బయటికి వచ్చినప్పుడు దానిపై కనీస విచారణ కూడా చేయలేదన్నారు. ఈ అక్రమాలపై మంత్రి నారా లోకేష్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలన్నారు. సిబిఐ దర్యాప్తు జరిపితే ఎక్కడ మంత్రి నారా లోకేష్ అవినీతి గుట్టు బయటపడుతుందోనన్న భయంతో.. మంత్రి లోకేష్ మోడీ కాళ్ల దగ్గర మోకరిల్లి సిబిఐ విచారణ అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు.
"నిరుద్యోగ భృతి ఎక్కడ"
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 30 లక్షల మంది యువతకు నిరుద్యోగ భృతి.. ఇస్తామని చెప్పి.. ఈరోజుటి వరకు ఒక్కరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు.ఇచ్చిన హామీ అమలు చేయకుండా ఈరోజు 30 లక్షల మంది యువత గొంతు కోశారని ఆవేదన వ్యక్తం చేశారు.
"పెండింగ్ లో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఊసే లేదు"
ఏడాదికి 9 లక్షల 70 వేల మంది విద్యార్థులకు.. ఫీజు రీయింబర్స్మెంట్ అందిస్తామని చెప్పి.. ఇప్పటివరకు ఒక్కరికి కూడా ప్లీజ్ రియంబర్స్మెంట్ చెల్లించకుండా విద్యార్థులను వేదనకు గురి చేస్తున్నారని అన్నారు..2024 ఎన్నికలకు ముందు 10 వేల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విద్యార్థులకు చెల్లించేందుకు జగన్మోహన్ రెడ్డి సంకల్పిస్తే కోర్టులకు వెళ్లి దాన్ని అడ్డుకున్నది కూటమి నేతల కాదా చెప్పాలన్నారు.
ఈ రోజుటికి ఆ బకాయిలను కూటమి ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించలేదన్నారు. ఈరోజు ఎంతోమంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అందక.. విద్యార్థులు చదువులు రోడ్డున పడ్డాయన్నారు. మంత్రి నారా లోకేష్ అనాలోచిత నిర్ణయాలు అవినీతి అక్రమాలతో.. విద్యావ్యవస్థని బ్రష్టు పట్టిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా నారా లోకేష్ డీఎస్సీ అక్రమాల విషయంలో రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




