Nellore: ఏఎస్ పేట ఎంపీడీవో కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత!

Nellore: నెల్లూరు జిల్లా ఏఎస్ పేట ఎంపీడీవో కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత. 4 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమైనట్లు ప్రకటించడంపై వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ఆందోళన, కలెక్టర్ జోక్యం చేసుకోవాలని డిమాండ్.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 28 Oct 2026 6:52 AM IST
Nellore
X

Nellore: ఏఎస్ పేట ఎంపీడీవో కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత!

Nellore: నెల్లూరు జిల్లాలోని ఏఎస్ పేట ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. మండలంలోని నాలుగు ఎంపిటిసి స్థానాలు ఏకగ్రీవం అయినట్లుగా అధికారులు ప్రకటించారు. గుంపర్లపాడు, చిరమన, చౌటభీమవరం, హసనాపురం ఎంపీటీసీ స్థానాలను అధికారులు ఏకగ్రీవంగా ప్రకటించడంపై వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థులు ఆందోళనకు దిగారు.

తమ సంతకాలు లేకుండానే ఏకగ్రీవంగా ఎలా ప్రకటిస్తారని వైసీపీ అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై నిరసన వ్యక్తం చేస్తూ పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు ఎంపీడీవో కార్యాలయం వద్దకు చేరుకున్నాయి.

దీంతో అక్కడ రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని వెంటనే తమ ఫోర్జరీ సంతకాలతో విత్ డ్రా చేసినట్టుగా ప్రకటించిన ఆర్వో వెంకటసుబ్బయ్య పై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని వారు కోరారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)