మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి కాకాణిని విమర్శించే అర్హత లేదు: సమీర్ ఖాన్

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సమీర్ ఖాన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 10 May 2026 7:11 PM IST
మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి కాకాణిని విమర్శించే అర్హత లేదు: సమీర్ ఖాన్
X

మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి కాకాణిని విమర్శించే అర్హత లేదు: సమీర్ ఖాన్

నెల్లూరు: మాజీ మంత్రివర్యులు మరియు జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డిని విమర్శించే అర్హత మాజీ శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి లేదన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సమీర్ ఖాన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సమీర్ ఖాన్, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

సమీర్ ఖాన్ మాట్లాడుతూ.... మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి రాజకీయంగా చనిపోయిన వ్యక్తి అని, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ని విమర్శించే అర్హత లేదని అన్నారు. జడ్పిటిసి, ఎంపీపీ, ఎంపీటీసీ, మార్కెట్ కమిటీ చైర్మన్ లాంటి పదవులతో పాటు పార్టీ పదవులను కూడా అమ్ముకున్న నీచ చరిత్ర మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

నీచమైన రాజకీయ చరిత్ర గల మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కాకాణిని విమర్శించడం సిగ్గుచేటని అన్నారు. కాకాణి గోవర్ధన్ రెడ్డిని విమర్శించే స్థాయి గాని, అర్హతగాని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి లేదని నిప్పులు చెరిగారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి కుటుంబం వల్లనే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి రాజకీయ భిక్ష లభించిందని, మేకపాటి కుటుంబానికి జిల్లా రాజకీయాల్లో మంచి పేరు ఉందని, ఆ పేరును చంద్రశేఖర్ రెడ్డి చెడగొట్టాడని విమర్శించారు.

మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మేకపాటి కుటుంబానికి వెన్నుపోటు పొడిచారని అన్నారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యలు దిగజారుడుతనానికి పరాకాష్ట అని అన్నారు. ఉదయగిరి MLA నిర్వహించే ఏ కార్యక్రమానికి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని పిలవలేదంటేనే అతని స్థాయి ఏంటో తెలుస్తుందని అన్నారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైఎస్ఆర్ కుటుంబం వల్లనే లబ్ధి పొంది తిరిగి ఆ కుటుంబాన్ని విమర్శించడం ఆయనకే చెల్లిందని అన్నారు. అతని స్థాయికి దిగజారి మాట్లాడాలంటే మాకు సంస్కారం అడ్డు వస్తుందని, లేకుంటే ఆయన నీచ చరిత్ర మొత్తం బయటపెట్టే వాళ్ళం అని అన్నారు.

మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి బ్రహ్మానందానికి ఎక్కువ కళ్ళు చిదంబరానికి తక్కువ లాంటివాడు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గతంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లాలో పదికి పది సీట్లు గెలిచామని, మరల ఆయన సారథ్యంలోనే పదికి పది సీట్లు గెలవబోతున్నామని చెప్పారు. ఇప్పటికైనా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని , లేకుంటే ఆయనకు తనకు అర్థం అయ్యే భాషలోనే సమాధానం చెప్పవలసి ఉంటుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సమీర్ ఖాన్.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story