Nellore: ఓటమి భయంతోనే వైసీపీ ఆరోపణలు!
Nellore: మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ అంతా చట్టప్రకారమే పారదర్శకంగా జరుగుతోందని, ఓటమి భయంతోనే వైసీపీ నాయకులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మంత్రి నారాయణ విమర్శించారు.
Nellore: ఓటమి భయంతోనే వైసీపీ ఆరోపణలు!
Nellore: మున్సిపల్ ఎన్నికల ప్రక్రియపై వైఎస్సార్సీపీ నేతలు చేస్తున్న అర్థం పర్థం లేని ఆరోపణలపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వార్డుల విభజన, రిజర్వేషన్లు ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా పూర్తి చట్టప్రకారం, పారదర్శకంగా చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారని, నిబంధనల ప్రకారమే ముందుకు వెళ్లాలని కలెక్టర్కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని ఆయన స్పష్టం చేశారు.
డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ బీసీ కోటాలో పోటీ చేయాలనుకున్నంత మాత్రాన రిజర్వేషన్లు మార్చలేదని, రోస్టర్ ప్రకారమే మేయర్ స్థానం ఓసీ జనరల్గా ఖరారైందని తెలిపారు. తన నియోజకవర్గంలోనూ పలు డివిజన్ల రిజర్వేషన్లు మారినా తాము జోక్యం చేసుకోలేదని, ఓటమి భయంతోనే వైసీపీ ఉనికి కోసం ఆరాటపడుతోందని ధ్వజమెత్తిన మంత్రి, కేవలం టీవీలలో లైవ్లు మరియు పేపర్లలో ఉండాలనే ఉద్దేశంతోనే ఆ పార్టీ నాయకులు నిరాధార విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రశాంత వాతావరణంలో, పూర్తిగా ప్రజాస్వామ్య పద్ధతిలో నిష్పక్షపాతంగా జరిగే ఈ ఎన్నికల్లో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొని మంచి చేసే వారికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.




