Nellore: అధికారుల గైర్హాజరుపై మండిపడుతూ జడ్పీ సమావేశం బహిష్కరణ!
Nellore: నెల్లూరు జడ్పీ చివరి సర్వసభ్య సమావేశానికి అధికారులు, మంత్రుల గైర్హాజరు.. సమావేశాన్ని బహిష్కరించి ఆందోళన చేపట్టిన జడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ.
Nellore: అధికారుల గైర్హాజరుపై మండిపడుతూ జడ్పీ సమావేశం బహిష్కరణ!
Nellore: జిల్లా పరిషత్ చరిత్రలోనే ఇలాంటి అవమానం ఎప్పుడూ జరగలేదని జడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్ చివరి సర్వసభ్య సమావేశానికి అధికారులు, మంత్రులు, శాసనసభ్యులు గైర్హాజరు కావడంపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
సర్వసభ్య సమావేశానికి ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరై జిల్లా సమస్యలపై చర్చించాల్సి ఉండగా, కీలకమైన వారు గైర్హాజరు కావడంపై ఆమె అభ్యంతరం తెలిపారు. ఈ తీరును నిరసిస్తూ జడ్పీటీసీలు, ఎంపీటీసీలతో కలిసి సమావేశాన్ని బహిష్కరించి బయటకు వచ్చారు.
అనంతరం జడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ, ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డితో పాటు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు బయట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు.




