Nellore: ఎన్నికల వ్యయ వివరాలు పక్కాగా నమోదు చేయాలి
Nellore: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వ్యయ వివరాలను పక్కాగా నిర్వహించాలని పరిశీలకులు వి. సాయిబాబు ఆదేశం. జెడ్పీ సీఈఓతో సమీక్షా సమావేశం.
Nellore: ఎన్నికల వ్యయ వివరాలు పక్కాగా నమోదు చేయాలి
నెల్లూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటి చేస్తున్న అభ్యర్థుల ఎన్నికల వ్యయ వివరాలను పక్కాగా నిర్వహించాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు వి. సాయిబాబు అన్నారు.
బుధవారం జిల్లా పరిషత్ కార్యాలయాన్ని ఎన్నికల వ్యయ పరిశీలకులు వి. సాయిబాబు సందర్శించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎన్నికల వ్యయానికి సంబంధించి అధికారులు సమర్పించాల్సిన నివేదికలు, అభ్యర్థులు సమర్పించాల్సిన ఖర్చుల వివరాలపై అధికారులకు వివరించారు.
ఎన్నికల వ్యయానికి సంబంధించిన వివరాలను నిబంధనల ప్రకారం పక్కాగా నమోదు చేసి, నిర్దేశిత సమయంలో సమర్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ మధుసూదన్, డిప్యూటీ సీఈఓ బ్రహ్మయ్య, జిల్లా సహకార అధికారి బి. గురప్ప, జిల్లా ఆడిట్ అధికారి డి. సింహాద్రి. , నోడల్ అధికారులు, ఎన్నికల వ్యయ పరిశీలన బృందం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.




