Kamareddy: రాష్ట్ర స్థాయి క్రీడలకు బీర్కూర్ ఎంజేపీ విద్యార్థులు ఎంపిక
Kamareddy: కామారెడ్డి జిల్లా బీర్కూర్ మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాల, కళాశాలకు చెందిన 10 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి ఖోఖో, నెట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యారు.
Kamareddy: రాష్ట్ర స్థాయి క్రీడలకు బీర్కూర్ ఎంజేపీ విద్యార్థులు ఎంపిక
కామారెడ్డి జిల్లా: బీర్కూర్ మహాత్మా జ్యోతి బా పూలే పాఠశాల,కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి,10 మంది విద్యార్థులు,రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ గోపీచంద్ రాథోడ్ తెలిపారు.
సెప్టెంబర్ 29 న కామారెడ్డిలో నిర్వహించిన అండర్ 17 విభాగం ఖోఖో లో బాలాజీ,రాము,బన్నీ,వినయ్ విష్ణు,అండర్ 19 నెట్ బాల్ లు రాష్ట్ర స్థాయిలో మనోహర్,యశ్వంత్, అభినవ్ విష్ణు,లు ఎంపిక అయ్యారని ఆయన తెలిపారు.
తమ పాఠశాల లోని క్రీడా ఉపాధ్యాయులు గోపాల్, అమేర్ లు అందించిన శిక్షణ ,ప్రోత్సాహం ఎంతో ఉపయోగ పడిందని విద్యార్థులు పేర్కొన్నారు.




