Banswada: స్నేహమంటే మాదే.. మృతి చెందిన మిత్రుడి కుటుంబానికి రూ. 63 వేల సాయం!

Banswada: 1989-90 పదవ తరగతి బ్యాచ్‌ స్నేహితులు తమ తోటి మిత్రుడు అబ్దుల్ ఖదీర్ మరణంతో కుంగిపోయిన అతని కుటుంబానికి రూ. 63,000 ఆర్థిక సహాయం అందించి ఆదర్శంగా నిలిచారు.

SALEEM, BANSWADA
Published on: 3 Aug 2026 9:10 PM IST
Banswada
X

Banswada: స్నేహమంటే మాదే.. మృతి చెందిన మిత్రుడి కుటుంబానికి రూ. 63 వేల సాయం!

బాన్స్వాడ: తమ తోటి మిత్రుడు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ కుటుంబానికి అండగా ఉండి 63వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించి ఆదర్శంగా నిలిచారు.

1989-90 పదవ తరగతి బ్యాచ్ కు చెందిన అబ్దుల్ ఖదీర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాగా,వారి కుటుంబానికి అండగా నిలవాలని ఆలోచించిన తోటి మిత్రులు తల కొంత డబ్బులు వేసుకొని 63 వేల రూపాయలు పోగుచేసి సోమవారం రోజు మృతి చెందిన మిత్రుని భార్య, కుమారులకు అందచేశారు.

ఏ అవసరం ఉన్న తెలుపాలని సహాయం చేస్తామని దైర్యంగా ఉండాలని తెలిపారు. కొట్టూరి సంతోష్, సత్యకిరణ్, ప్రభుదాస్, రమేష్ సింగ్, జానకిరామ్, శేషాద్రి యాదవ్, సంబు రాజు, రషీద్, పెండ్యాల కాశినాథ్, హన్మాండ్లు,వెంకటి ముస్లిం పెద్దలు వార్డ్ సభ్యుడు ఖాజా, సదర్ సాబ్ మొహమ్మద్ రియాజ్ తదితరులు ఉన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA

Next Story